Tuesday, October 3, 2017

తెలుగోళ్ళకి పట్టని "నదుల కోసం నడక": ఱాలీ ఫర్ రివర్స్


బ్లాగుల్లో మానసిక ఉల్లాసం కోసం పద్యాలు, ప్రశ్నలూ, చింతన పోరాటాలూ చేయటం తప్ప జగ్గీ వాసుదేవ్ అనే ఆయన నదుల కోసం పెద్ద ఎత్తున దేశ వ్యాప్త కార్యక్రమం చేస్తూ ప్రజలనూ, ప్రభుత్వాలనూ ఆ దిశలో చైతన్యం కలిగిస్తున్నారు.. ఇందులో వారికి 30కోట్ల మిస్సెడ్ కాల్స్ కావాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పాలసీ తేవటానికి.. ఇందులో భాగంగా నదులకు ఇరువైపులా భారీ ఎత్తున చెట్ట్లు నాటుతారు.. అలా ఒడ్డు గట్టిపడి వరదలను నివారిస్తాయి.. నీరు అడవి నుంచి నదిలో చేరి నీటి ప్రవాహమూ పెరుగుతుంది..

మీకు మీరు ఆధ్యాత్మికంగా గొప్పవారనుకున్నా.. జగ్గీ వాసుదేవ్ ని ఆధ్యాత్మికంగా ఫాలో కాకపోయినా.. పర్యావరణాన్ని రక్షించే ఈ బృహత్ కార్యాన్ని చిన్న చూపు చూడకండి..

మిస్సెడ్ కాల్ 8000980009

Sunday, December 23, 2012

చెప్పుల పూల దండల కృష్ణా, ఇప్పటి వరకూ అసలు భారత దేశంలో అత్యా చారాలే జరగలేదా ?

లేక పోతే, ఢిల్లీ లోన జరిగిన మొట్ట మొదటి అత్యాచారమా మొన్న జరిగింది ? అనాది నుంచీ జరుగుతూ వస్తున్నవే ఈ అత్యా చారాలు. మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు అందరూ నిద్ర లేచి బట్టలు చింపుకుంటున్నారు ? ( తప్పదు, ఇలాగే అడగాలి. ఇన్నాళ్ళు గాడిద పళ్ళు తోముతున్నారా ?)

మరి ఈ అత్యాచారపు రాక్షసత్వం మద్యం వల్లనో, వ్యభిచారుల వల్లనో ఏర్పడిందా ? కారణాలు ఏమిటి ? మీలో ఎంత మందికి ఒక అబలని చూసి హేళన చేయాలనిపించదు ? అవకాశం వస్తే మీలో ఎంత మంది అఘాయిత్యాలకు తెగ బడరు ? ఇక్కడ అబల అన్నాను, మగా, ఆడా, కాలేజీలో జూనియర్లా, తక్కువ కులం వాళ్ళా, మైనారిటీలా, తక్కువ ధనం ఉన్నవాళ్ళా, అధికారం లో లేని వాళ్ళా, ....మొ.. లైన ఏమీ అనలేదు.

రేపు మాత్రమే తీసుకుంటే, కొంతమందికి అసలు ఎందుకు రేపు చేయాలని పిస్తుంది, ఆ ఆలోచన వచ్చే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, అసలు మనిషి జంతువుగా ఏ పరిస్థితుల్లో మారుతున్నాడు. ఈ ప్రవర్తనకు మూల కారణాలు ఏమిటి ?

ఏ విధమైన అత్యాచార ఘటనలకైనా, సమాజం మొద్దు నిద్ర లో ఉండటానికైనా, కారణం నపుంసక ప్రభుత్వాలే.

కుల, మత, ధన, ప్రాంత మొ..లైన మానసిక వైకల్యాలు కల ప్రజలు తమ ప్రభుత్వాలను తమ  తమ పిచ్చిల కనుగుణంగా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఇక ఈ పిచ్చిలు గల పిచ్చి ప్రజల నిర్ణయాలను బేరీజు వేసుకుంటున్న ప్రభుత్వాలు తదనుగుణంగా, అంటే ఈ పిచ్చి ప్రజల లో ఎక్కువ మంది పిచ్చి వాళ్ళకి సరి అనిపించేలా ఉన్న నిర్ణయాలనే అమలు చేస్తూ వస్తూ ఉన్నాయి.
మరి పరిష్కారం ?
ఈ వైకల్యపు ప్రజల చేతిలోనుంచి ప్రభుత్వాన్ని చదువుకున్న మరియు ప్రాక్టికల్ గా పనులు చేసిన జీనియస్ ల చేతిలో ఉంచితే తప్ప ఈ రాజ్యాలు సరిగా నిలబడలేవు. మనుషులను కేవలం మనుషులుగా మాత్రమే చూసే వ్యక్తుల వలననే మనుషులకు సమ న్యాయం కలుగుతుంది. మనకు కావల్సినవి ఢిల్లీ, హైదరాబాదు ప్రభుత్వాలు కావు. నిరంతరం మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు చెప్పే చదువుకున్న వారి ప్రభుత్వాలు. గ్రామ ప్రభుత్వాలు, ప్రాంత ప్రభుత్వాలు. భాషకో ప్రభుత్వం కాదు, ప్రజలున్న ప్రాంతానికో ప్రభుత్వం, అది గ్రామమైనా, గ్రామాల కూటములైనా.

ఇక చదువుకున్న వారి ప్రభుత్వాలు ఈ రాక్షస ప్రవర్తనలను ఎలా ఏర్పడకుండా వ్యవస్థని మారుస్తాయి ?
చదువు కున్న, వ్యాపారాలు ( లాయర్లు, డాక్టర్లు, ఐఏఎస్... మొదలైన వారు) నడిపించిన వారికి మన్షుల కులం, జాతి, లింగం, అంతస్థులు కనపడవు. వారి చర్యలు మగ వారినీ, ఆడవారినీ సమంగా చూస్తాయి. ఆడవారికీ, మగవారికీ మధ్య సమాజం లో ఉన్న కట్టు బాట్లు తగ్గి పోయి, అత్యాచారం చేయాల్సిన అవసరం లేని విధంగా ఎదుటి వారి మనసు గెలుచుకునే కళ నేర్చుకుంటారు. అత్యాచారపు/చెడు ఆలోచనలు కావు కదా, ఎలా సహాయ పడాలి అనే ధోరణి ఏర్పడుతుంది.

చదువుకున్న, వృత్తి లో మంచి అనుభవం ఉన్న వారిని గెలిపించటం వల్ల ఎక్కువ అంశాల్లో సరైన మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది.

ఇదంతా ప్రాక్టికల్ గా జరగని పని అనుకునే వాళ్ళు ప్రయత్నించటానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టే. దయ  చేసి ఈ సారి సరైన చదువుకున్న, మంచి అనుభవం ఉన్న వ్యక్తికి ఓటు వేయండి.